schedule Saturday, September 12, 2026

అదిరేదిలే.. బెదిరేదిలే..!

calendar_today February 20, 2023
person dharshininews
అదిరేదిలే.. బెదిరేదిలే..!
అదిరేదిలే.. బెదిరేదిలే..! - కేసులెన్ని అయినా భయపడను - తాండూరుకు ఆయన వన్‌ టైం ఎమ్మెల్యేనే - మరిన్ని సంచలన వాఖ్యలు చేసిన మురళీకృష్ణ గౌడ్ - 14 రోజుల తరువాత జైలు నుంచి విడుదల తాండూరు, దర్శిని ప్రతినిధి: అక్రమ కేసులు ఎన్ని పెట్టినా అదిరేది లేదు.. బెదిరేది లేదు అంటూ వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్, బీజేపీ నాయకులు మురళీకృష్ణ గౌడ్ అన్నారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం దేవనూర్‌లో జరిగిన శివ స్వాముల ఘటనతో గత నెల మురళీకృష్ణ గౌడ్ అరెస్ట్ అయి రిమాండుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లడంతో 14 రోజుల తరువాత బేయిల్ మంజూరు చేసింది. దీంతో మురళీకృష్ణ గౌడ్ సోమవారం జైలు నుంచి విడుదల అయ్యారు. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నాయకులు మురళీకృష్ణ గౌడ్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ జైలుకు వెళ్లడం భగవంతుడు వేసిన శిక్షగానే భావిస్తున్నానని అన్నారు. తనపై ఎన్ని అక్రమ కేసులను పెట్టినా భయపడేదని.. బెదిరేది లేదన్నారు. తనతో పాటు చాలా మందిపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన తండ్రి విఠల్ రెడ్డిలు ఎన్నో అక్రమ కేసులను పెట్టారని ఆరోపించారు. తాండూరుకు రోహిత్ రెడ్డి వన్ టైం ఎమ్మెల్యే మాత్రమే అని.. ఆయనపై ఉన్న కేసులకు గాను రానున్న రోజుల్లో ఆయన జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. అంతకుముందు అక్రమ కేసులో జైలుకు వెళ్లిన బాధిత కుటుంబాలకు మురళీకృష్ణ గౌడ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నుంచి ఆయన మూట ముల్ల సర్దుకోవాల్సిందే అని విమర్శించారు. జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు హనుమంతు, అడ్వకేట్ నర్సింగరావు, బీజేపీనాయకులు, అభిమానులు తదితరులున్నారు. https://youtu.be/_ih5kaqvPxQ