schedule Sunday, July 05, 2026

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

calendar_today January 14, 2023
person dharshininews
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - వికారాబాద్‌ మీదుగా రైళ్ల సర్వీసుల దారి మళ్లింపు - ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ తాండూరు, దర్శిని ప్రతినిధి : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్ పరిధిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్‌ నుంచి తాండూరు మీదుగా సాగే రైల్వే సర్వీసులను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. శనివారం వికారాబాద్ మీదుగా కర్ణాటక వైపు వెళుతున్న గూడ్స్ రైలు కర్ణాటకలోని సులానీ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి సంబంధించి సమగ్ర వివరాలు తెలియాల్సి ఉంది. గూడ్స్ రైలు పట్టాల తప్పడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాయలసీమ ఎక్స్ ప్రెస్ , హుస్సేన్ సాగర్ , బీజాపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలు దారి మళ్లించి సేవలను అందిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు రైల్వే ప్రమాదంపై అధికారులు వెంటనే అప్రమత్తమై మరమ్మత్తులపై దృష్టి సారించారు. దారి మళ్లించిన రైళ్లు ఇవే