schedule Saturday, September 12, 2026

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

calendar_today December 31, 2022
person dharshininews
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం - రూ.5వేలు అందించిన వాసు పవార్ నాయక్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతునికి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి భూకైలాస్ వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్ ఔనత్యాన్ని చాటుకున్నారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన మోహన్ లాల్ కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. శనివారం మధ్యాహ్నం చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మొహన్ లాల్ మరణించాడు. అంతారం ఎంపీటీసీ శాంతు ద్వారా భూకైలాస్ వ్యవస్థాపకులు వాసుపవార్ నాయక్ విషయం తెలుసుకుని కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని అంత్యక్రియల నిమిత్తం వాసుపవార్ నాయక్ కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సహాయం అందించే వాసు పవార్ నాయక్ సేవలకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్మకన్నె సహాకా సంఘం మాజీ డైరెక్టర్ పెండా అబ్రహం, గ్రామస్తులు ఉన్నారు.