schedule Sunday, July 05, 2026

ద్విచక్ర వాహనం, ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

calendar_today November 9, 2022
person dharshininews
ద్విచక్ర వాహనం, ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ద్విచక్ర వాహనం, ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - పాలిషింగ్‌ కార్మికుడి మృతి - మరో మహిళకు గాయాలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: ద్విచక్ర వాహనం - ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో మహిళ గాయాల పాలయ్యింది. ఈ సంఘటన బుధవారం తాండూరు మండలం గౌతాపూర్ రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోడంగల్ మండలం ఉడిమేశ్వరంకు చెందిన నందిగామ సాయప్ప గౌతాపూర్ సమీపంలోని రాములు అనే వ్యక్తికి పాలిషింగ్ యూనిట్లో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం తన టీవీఎస్ ఎక్సెల్ (టీఎస్07 ఈకే 4731) అనే వాహనంలో పెట్రోల్ పోసుకునేందుకు హన్మమ్మ అనే కలిసి చించొల్లి రోడ్డు మార్గంలోని ఉన్న రిలయన్స్ పెట్రోల్ పంపుకు వైపుకు వెళుతున్నాడు. అదే సమయంలో తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈక్రమంలో సాయప్ప వాహనం ముందు టైరు వరకు బస్సు కిందకు వెళ్లింది. ఢీకొన్న వెంటనే సాయప్పకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న హన్మమ్మ కింద పడి కాలుకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలు హన్మమ్మ, సాయప్ప మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు.