schedule Sunday, July 05, 2026

పేపర్ చూస్తూ కుప్పకూలిన వ్యాపారి

calendar_today November 8, 2022
person dharshininews
పేపర్ చూస్తూ కుప్పకూలిన వ్యాపారి
పేపర్ చూస్తూ కుప్పకూలిన వ్యాపారి - క్షణాల్లో గుండె ఆగి కన్నుమూత - సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు వైరల్ దర్శిని డెస్క్‌ : ఓ వృద్ధుడు పేపర్‌ చదువుతో క్షణాల పాటు ఆగిపోయాడు.. ఆ వెంటనే కుప్పకూలి పడిపోయి ప్రాణాలను కోల్పోయాడు. వ్యాపారి గుండెపోటుతో మరణించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రాజస్థాన్‌లో బడ్మేర్‌లో ఈ సంఘటన జరిగింది. వివరాలలోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన దిలీప్ కుమార్(61) వస్త్ర వ్యాపారి నిర్వహిస్తున్నారు. ఈనెల 4న ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బడ్మేర్‌కు వచ్చారు. పంటి నొప్పి ఉండటంతో మరుసటి రోజు నవంబర్‌ 5న వైద్యుడిని కలిసేందుకు క్లీనిక్‌కు వెళ్లారు. అయితే వైద్యుడిని కలిసేందుకు సమయం ఉండడంతో పక్కన ఉన్న బేంచిపై కూర్చున్నాడు. అక్కడే ఉన్న ఓవార్తా పత్రిక చదివారు. అకస్మాత్తుగా అసౌకర్యానికి గురై అలా కొన్ని క్షణాలు ఆగిపోయిన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే ఉన్న క్లినిక్‌ సిబ్బంది హుటాహుటిన అతడి వద్దకు చేరుకొని సాయం అందించేందుకు ప్రయత్నించారు. వెంటనే చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. కాని ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయారు. ఈ ఘటనపై డాక్టర్‌ కపిల్‌ జైన్‌ మాట్లాడుతూ.. ఆ కుటుంబ సభ్యులతో మొదట మాట్లాడకుండా దీనిపై తానేమీ చెప్పలేనన్నారు. కుప్పకూలిపోయిన అతడిని ట్యాక్సీలో ఆస్పత్రికి తరలిస్తున్నట్టు తమ సిబ్బంది చెప్పారన్నారు. కానీ చికిత్స ఫలించక మృతి చెందినట్లు వారు తెలిపారు. इस तरह की घटनाएं चिंता बढाने वाली है। पचपदरा (बाड़मेर) निवासी दिलीप जी जैन अचानक अखबार पढ़ते पढ़ते चल बसे। कोरोना के बाद लगातार ऐसी घटनाएं बढ़ रही है।#Rajasthan pic.twitter.com/SoUNn4D4mV — Vivek Shrivastava (@Viveksbarmeri) November 6, 2022 https://twitter.com/i/status/1589179065168433154