schedule Sunday, July 05, 2026

రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య

calendar_today November 7, 2022
person dharshininews
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య - తాండూరు, మంతట్టి మార్గం మద్య ఘటన - మృతుడు వీర్ శెట్టిపల్లి గ్రామస్తుడుగా గుర్తింపు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రైలుకింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు, మంతట్టి రైల్వే మార్గంలో ఓ యువకుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో పరిశీలించగా మృతుడు తాండూరు మండలం వీర్ శెట్టిపల్లి గ్రామానికి చెందిన గుడిసె విజయ్ కుమార్ కుమారుడు గుడిసె ప్రసాద్ (25)గా గుర్తించారు. ప్రసాద్ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. కాగా ప్రసాద్ తాండూరులోని గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రసాద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్ధం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు.