schedule Saturday, September 12, 2026

పోలీసులను ఆశ్రయించిన నవ దంపతులు

calendar_today November 3, 2022
person dharshininews
పోలీసులను ఆశ్రయించిన నవ దంపతులు
పోలీసులను ఆశ్రయించిన నవ దంపతులు - కౌన్సిలింగ్ ఇచ్చిన కరణ్ కోట్ పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న నవ దంపతులు కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు పైగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇరు కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన తలారి బల్వంతు, అదే గ్రామానికి చెందిన శిరీషలు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందినా ఇంట్లో పెద్దలు పెళ్లికి విముఖత తెలపడంతో ఇటీవలే ఇంటి నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. గురువారం కరణ్ కోట్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్ఐ మధుసుధన్ రెడ్డి ఇరుకుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ప్రేమ జంట పెళ్లి.. పోలీసుల కౌన్సిలింగ్ తో ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు.