schedule Saturday, September 12, 2026

నెత్తురోడిన రోడ్డు..!

calendar_today November 3, 2022
person dharshininews
నెత్తురోడిన రోడ్డు..!
నెత్తురోడిన రోడ్డు..! - ఆటోను ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి - ధారూర్ కేరెళ్లి - బాచారం మార్గంలో ఘటన - బాధతులు పెద్దేముల్ వాసులు ధారూర్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా ధారూర్ మండలంలోని కేరెళ్లి - బాచారం రోడ్డు నెత్తురోడింది. ఆటోను లారీ ఢీ కోనడంతో ఘోర ప్రమాదం చోటు జరిగింది. ఈప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే..క్రషర్ మిషన్లో పనిచేసేందుకు పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండా నుండి ఆటోలో కూలీలను తీసుక వస్తుండగా ధారూరు మండలం కేరెళ్లి రైతు వేదిక సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో సంఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వికారాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రికి చేరగానే మరో వ్యక్తి మృతి ప్రాణాలు కోల్పోయాడు. పలువురి పరిస్థితి విషమంగా ఉండగా వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతుల్లో ఆటో డ్రైవర్‌ జమీల్‌, రవి, కిషన్‌, సోనీబాయిగా గుర్తించారు. బాధితులంతా పెద్దేముల్‌ మండలం మదనంతాపూర్‌ వాసులుగా పోలీసులు తెలిపారు. కూలీ పనుల కోసం వికారాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబాల రోధనలు మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.