schedule Saturday, September 12, 2026

పేకాట స్థావరాలపై దాడి..!

calendar_today October 31, 2022
person dharshininews
పేకాట స్థావరాలపై దాడి..!
పేకాట స్థావరాలపై దాడి..! - వేరు వేరు ప్రదేశాల్లో 12 మంది అరెస్టు - రూ.45,280ల నగదు, పేకాట ముక్కలు స్వాధీనం - ప్రకటించిన తాండూరు పట్టణ పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి: కొందరు వ్యక్తులు వేరు వేరు ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న స్థావరాలపై తాండూరు పట్టణ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 12 మందిని అరెస్టు చేసి.. రూ.45,280ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తాండూరు పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం తాండూరు పట్టణం గొల్ల చెరువు వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో పట్టణానికి చెందిన ఎండి వసీయోద్దీన్, అత్తర్, రాథోడ్ మహేష్, అబ్దుల్ ఖదీర్, పెద్దేముల్ ప్రశాంత్ కుమార్, మద్దికంటి రవీందర్, బాబాలు పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలిసి దాడులు నిర్వహించారు. వారి వద్ద నుంచి రూ.28,080ల నగదు, 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సాయంత్రం పట్టణంలోని బృందావన కాలనీ మార్గంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో తాండూరుకు చెందిన రవి కుమార్, లక్ష్మీకాంత్, శ్రీకాంత్, కావలి సుధాకర్, దానాల వెంకట్ లు పేకాటు ఆడుతున్నట్లు సమాచారం అందుకుని దాడులు చేశారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి రూ. 17,200లు స్వాదీనం చేసుకున్నారు. వేరు వేరు సంఘటనల్లో మొత్తం 12 మంది నుంచి రూ. 45.280ల నగదు, 104 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.