schedule Thursday, September 03, 2026

విచారణకు హాజరైన నటి రకుల్ ప్రీత్ సింగ్

calendar_today September 3, 2021
person dharshininews
విచారణకు హాజరైన నటి రకుల్ ప్రీత్ సింగ్
విచారణకు హాజరైన నటి రకుల్ ప్రీత్ సింగ్ ద‌ర్శిని ప్ర‌తినిధి : టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం, డ్రగ్స్‌ సరఫరా, మనీ లాండరింగ్‌, ఫెమా.. ఆరోపణ‌ల‌పై ఈడీ అధికారులు విచారణకు హాజరైన టాలీవుడ్‌ స్టార్స్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా డ్ర‌గ్ వినియోగ ఆరోప‌ణ‌లో కేసులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ ఈడీ ఆఫీస్ దగ్గర రకుల్ రాక నేపథ్యంలో భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ స‌మ‌యంలో పోలీసులు మీడియాను లోపలకి అనుమతించలేదు. ఇప్పటికే డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, నటి చార్మిని విచారించారు అధికారులు. డ్రగ్స్‌ దందాలో సూత్రధారులు ఎవరు ? పాత్రధారులు ఎవరు ? బాధితులు ఎవరు ? నిందితులు ఎవరు ? అని ఆరా తీస్తున్నారు. కాగా, ఈడీ అధికారుల షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 6వ తేదీన రకుల్‌ప్రీత్‌సింగ్‌ విచారణకు హాజరు కావాలి. అయితే అనివార్య కారణాలతో ఆ రోజు తాను రాలేనంటూ రకుల్‌ రిక్వెస్ట్ చేసుకున్నారు. అయితే.. డేట్ మార్చేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ముందుగా వచ్చేందుకు రెడీ అంటూ ఆమె మరో మెయిల్ పంపారు. డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా టాలీవుడ్‌ నటీనటులకు ఈడీ అధికారులు నోటీసుల ఇవ్వడంతో రకుల్‌ని కూడా కెల్విన్‌ గురించి ప్రశ్నలడిగే అవకాశం ఉంది. కెల్విన్‌ మీకు ఎలా తెలుసు ? ఎప్పటి నుంచి తెలుసు ? అతడికి మనీ ట్రాన్స్‌ఫర్‌ చేశారా ? లాంటి క్వొశ్చన్స్‌ అడిగే అవకాశం ఉంది. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ విచారణ కీలకంగా మారే అవకాశం ఉంది.