schedule Saturday, September 12, 2026

మూగజీవాలపై మృత్యుపాశాలు

calendar_today October 21, 2022
person dharshininews
మూగజీవాలపై మృత్యుపాశాలు
మూగజీవాలపై మృత్యుపాశాలు - విద్యుదాఘాతంతో కాడెద్దుల మృతి - యాలాల మండలం దేవనూర్‌లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యుత్ తీగలు మూగ జీవాల పట్ల మృత్యుపాశాలు అయ్యాయి. విద్యుదాఘాతానికి గురై కాడెద్దులు మృతి చెందాయి. ఈ సంఘటన శుక్రవారం యాలాల మండలం దేవనూర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన హన్మాపురం లక్ష్మయ్య వారి పొలానికి కాడెద్దులను తీసుకెళ్లారు. అప్పటికే పోలంలో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. గమనించని ఎద్దులు విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో రైతు, కుటుంబ సభ్యులు విలపించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు మృతి చెందాయని ఆరోపించారు. పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు లూప్ లైన్ సరి చేయమని ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబానికి మూగ జీవాల తోడు దూరమై పోవడంతో తీవ్ర నష్టం జరిగింది. బాధిత కుటుంబాన్ని అదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.