schedule Saturday, September 12, 2026

అదృశ్యమైన నాలుగోరోజే..!

calendar_today October 14, 2022
person dharshininews
అదృశ్యమైన నాలుగోరోజే..!
అదృశ్యమైన నాలుగోరోజే..! - చెరువులో శవమై తేలిన వ్యక్తి - చింతామణిపట్నంలో వెలుగులోకి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి నాలుగో రోజే చెరువులో శవంగా లభ్యమయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు మండలం చింతామణిపట్నం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. కరణ్ కోట్ ఎస్ఐ మధుసూధన్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం చింతామణిపట్నం గ్రామానికి హరిజన్ ఎల్లప్ప ఈ నెల 10న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని కుమారుడు నర్సింలు 13న కరణ్ కోట్ పోలీస్టేషన్లో ఎల్లప్ప అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శుక్రవారం ఉదయం చింతామణిపట్నం గ్రామ సమీపంలోని చెరువులో ఎల్లప్ప మృతదేహంగా లభ్యమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడే పంచనామ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు.