schedule Saturday, September 12, 2026

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

calendar_today October 6, 2022
person dharshininews
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - తాండూరు రైల్వేట్రాక్ సమీపంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ స్థంబానికి ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం పోసారం గ్రామానికి చెందిన జెన్నారం ఆంజప్ప(26) భార్య, పిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం తాండూరుకు వలస వచ్చాడు. తాండూరు పట్టణంలోని మల్ రెడ్డిపల్లిలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గత శనివారం ఇంటి నుంచి ఊరెళెతున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం తాండూరు నుంచి నారాయణపూర్ వెళ్లే రైల్వే మార్గంలో ఓ విద్యుత్ స్థంబానికి వేసుకున్న షర్టుతో ఉరేసుకుని శవమై కనించాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆంజప్ప ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మ‌రోవైపు అంజప్ప ఆత్మహ‌త్య తీరు అనుమానాల‌కు తావిస్తోంది.