లోకల్ అంటూ టోల్ బూత్ ఉద్యోగినిపై దాడి
August 22, 2022
dharshininews
లోకల్ అంటూ టోల్ బూత్ ఉద్యోగినిపై దాడి
- చెప్పుతో సాలిడ్ దెబ్బతీసిన మహిళ
- సోషల్ మీడీయాలో వీడియో.. వైరల్
దర్శిని డెస్క్ : నేను లోకల్.. నాకు మినహాయింపు ఇవ్వాలని ఓ వ్యక్తి టోల్ బూత్‌లో మహిళ ఉద్యోగిపై రెచ్చిపోయాడు. చెంపై దాడిచేసిన అతడికి చెప్పుతో సాలిడ్‌గా దెబ్బతీసింది. శనివారం మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గడ్, భోపాల్ రోడ్డు పై కచనరియా టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంఘటన వైరల్ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళితే.. కచనరియాలోని టోల్ ప్లాజా దగ్గర రాజ్‌కుమార్ గుర్జార్ కారు వచ్చింది. ఫాస్టాగ్ లేకుండా కారు వచ్చి ఆగింది. దీంతో టోల్ బూత్‌లో విధుల్లో ఉన్న అనురాధా డాంగీ అనే మహిళా ఉద్యోగి చార్జీ కట్టాలని అడిగింది. దానికి ఆయన నేను లోకల్ వ్యక్తేనని, తనకు టోల్ చార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్నాడు. దానికి ఆమె నాకు మీరు ఎవరో తెలియదని చెప్పడంతో గొడవ మొదలైంది. అక్కడనే సూపర్ వైజర్ ఆ వ్యక్తి నాకు తెలుసా అని అనురాధను అడిగారు. ఇందుకు ఆమె తెలియదు అని చెప్డంతో కోపడంతో ఆ వ్యక్తి కారు నుంచి బయటకు దిగతి వచ్చి దూషించాడు. వెంటనే చెంపపై కొట్టారు. వెంటనే అనురాధ తన చెప్పుతో ఆ వ్యక్తిపై గట్టిగా దాడిచేసి బదులిచ్చింది. ఈ సంఘటన అనంతరం అనురాధ వివరాలను వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితుడిపై కేసు నమోదైంది. అయితే ఇంకా నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంది. స్థానిక పోలీసు స్టేషన్ ఇంచార్జీ రామ్ కుమార్ రఘువంశీ మాట్లాడుతూ, ‘టోల్ ప్లాజా మహిళా ఉద్యోగి ఫిర్యాదు ఇచ్చింది. అనురాధా డాంగి ఆ వ్యక్తిపై రాతపూర్వక ఫిర్యాదు సమర్పించింది. ఆ ఫిర్యాదు ఆధారంగా మేం కేసు నమోదు చేశాం. నిందితుడిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉన్నది’ అని వివరించారు.
https://www.instagram.com/reel/ChjZc0xAse1/?utm_source=ig_web_copy_link
https://twitter.com/amandwivedi48/status/1561348133162196998