schedule Monday, September 07, 2026

జీఓ 111 ఎత్తివేస్తాం..!

calendar_today April 12, 2022
person dharshininews
జీఓ 111 ఎత్తివేస్తాం..!
జీఓ 111 ఎత్తివేస్తాం..! - సీఎస్ ఆధ్వ‌ర్యంలో క‌మిటి: సీఎం కేసీఆర్ హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: హైద‌రాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వాసుల‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ శుభ‌వార్త‌ను చెప్పారు. జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వికారాబాద్‌ జిల్లా, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ అయితే, జీవో 111 ఎత్తివేత విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, వాటిని తొలగించి జీవో ఎత్తివేస్తామని చెప్పారు. దీనిపై సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ వేశామని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌, శంషాబాద్, శంక‌ర్ ప‌ల్లి, చేవ‌ళ్ల‌, షాద్ న‌గ‌ర్‌, షాబాద్ మండ‌లాల్లోని దాదాపు 84 మంది గ్రామాలు 111 జీవోను ఎత్తివేయాల‌ని గ‌త ద‌శాబ్ద కాలంగా డిమాండ్ చేస్తున్నారు.