schedule Saturday, September 05, 2026

మ‌ట‌న్‌, చికెన్ షాపులు బంద్

calendar_today April 9, 2022
person dharshininews
మ‌ట‌న్‌, చికెన్ షాపులు బంద్
మ‌ట‌న్‌, చికెన్ షాపులు బంద్ - ఉత్త‌ర్వులు జారీ చేసిన ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణంలో ఆదివారం మ‌ట‌న్‌, చికెన్ షాపులు బంద్ పాటించాల‌ని ఆర్డీఓ, మున్సిప‌ల్ ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ ఆదేశాల మేర‌కు అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. శ్రీ‌రామ న‌వ‌మి పండ‌గ‌ను పుర‌స్క‌రించుకుని ప‌ట్ట‌ణంలోని మ‌ట‌న్, చికెన్ షాపుల‌కు నోటీసులు జారీ చేశారు. ఉద‌యం నుంచి దుకాణాల‌ను మూసి వేసి ఉంచాల‌ని నోటీసులో పేర్కొన్నారు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా దుకాణాల‌ను తెరిస్తే జ‌రిమానాల‌తో పాటు సీజ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. అధికారులకు అంద‌రు స‌హ‌క‌రించాల‌ని సూచించారు.