schedule Monday, September 07, 2026

నిరు పేదలకు అండగా సీఎం స‌హాయ నిధి ప‌థ‌కం

calendar_today March 8, 2022
person dharshininews
నిరు పేదలకు అండగా సీఎం స‌హాయ నిధి ప‌థ‌కం
నిరు పేదలకు అండగా సీఎం స‌హాయ నిధి ప‌థ‌కం - ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి - లబ్దిదారునికి రూ. 2.50 లక్షల ఎల్వోసీ అందజేత తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : సీఎం సహాయ నిధి పథకం పేదలకు అండగా నిలుస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్ 9వ వార్డుకు చెందిన కె.మహేష్ కు మున్సిప‌ల్ మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్న‌మాల న‌ర్సింలు స‌హాకారంతో ప్రభుత్వం ద్వారా సీఎం సహాయ నిధి కింద రూ. 2,50లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందిస్తుందని అన్నారు. ఈ పథకం పేదలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు బిర్క‌డ్ రఘు, కౌన్సిలర్లు రాము, వెంకన్నగౌడ్, టీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దర్శాత్రేయ రాజు, పూజారి బ‌బ్లూ తదితరులు ఉన్నారు.