schedule Saturday, September 05, 2026

కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించడం సిగ్గుచేటు

calendar_today February 3, 2022
person dharshininews
కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించడం సిగ్గుచేటు
కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించడం సిగ్గుచేటు - తాండూరులో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానించడం సిగ్గు చేటని తాండూరు యాత్ కాంగ్రెస్ నేతలు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షలు బోయ అశోక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ భారత రాజ్యాంగాన్ని విస్మరించే విధంగా వాఖ్యలు చేయడం సిగ్గు చేటు అన్నారు. రాజ్యాంగాన్ని అవమానించే స్థాయికి ఏదిగారా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.