schedule Friday, September 04, 2026

మాస్కు లేకుంటే జ‌రిమాన‌..!

calendar_today January 16, 2022
person dharshininews
మాస్కు లేకుంటే జ‌రిమాన‌..!
మాస్కు లేకుంటే జ‌రిమాన‌..! - క‌రోనా క‌ట్టడిలో తాండూరు పోలీసులు - కొవిడ్ నియంత్ర‌ణ‌కు పోలీసుల‌ అవగాహన తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : కరోనా కట్టడికోసం మరోసారి పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజల్లోకి వచ్చి కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహనలు క‌ల్పిస్తూనే మాస్కు లేకుంటే జరిమాన తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. గ‌త వారం రోజులుగా తాండూరులో రోజు రోజుకూ క‌రోనా కేసులు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనా కేసుల‌ను నియంత్రించ‌డంలో భాగంగా ఆదివారం తాండూరు పట్టణ రవూఫ్, పోలీసులు కరోనా నిబంధనలపై అవగాహన కల్పించారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా, బస్టాండ్, భద్రేశ్వర చౌరస్తా, నాన్ వెజ్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కులు వేసుకోని వారికి జరిమానాలు విధించారు. మాస్కులు ధ‌రించ‌కుండా బ‌య‌ట‌కు వ‌చ్చిన వారికి మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఐ ర‌వూఫ్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని సూచించారు. ఇంటి నుంచి వెళ్లే ముందు, వచ్చిన తరువాత చేతులను శుభ్రం చేసుకోవాలని అన్నారు. ఎదుటివారితో మాట్లాడేటప్పు మాస్కు ధ‌రించి భౌతికం దూరం పాటించాలన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇతరులను చైతన్య పరచాలన్నారు. మాస్కు ధరించకుంటే జరిమానలు తప్పవని హెచ్చరించారు. నిర్ల‌క్ష్యం చేసిన వారికి రూ. 1వెయ్యి జ‌రిమాన విధించ‌డం జ‌రుగుతుందని అన్నారు. క‌రోనా క‌ట్ట‌డికి అంద‌రు స‌హ‌క‌రించాల‌ని కోరారు.