ఐసీయూకు అనుకూలం..!
January 6, 2022
dharshininews
ఐసీయూకు అనుకూలం..!
- జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటుకు కసరత్తు
- నేతలు, అధికారులు దృష్టి సారిస్తే నేరవేరే కల
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న తాండూరులోని జిల్లా ఆసుపత్రి మంచి గుర్తింపు పొందింది. పేదలకు భరోసా వంతమైన సేవలందిస్తున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి నేతలు, అధికారులు అందిస్తున్న సహకారంను మరింత పొడగిస్తే మరిన్ని మెరుగైన వైద్య సేవలను పొందుతారనడంతో సందేహం లేదు. జిల్లా ఆసుపత్రి నుంచి ప్రస్తుతం మాతా శిశు సేవలు వేరుపడింది. ఆసపత్రిలో ప్రతిరోజూ ప్రసూతి సేవలు రికార్డులో స్థాయిలో పెరగడంతో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రికి అందుబాటులోకి తీసుకవచ్చేందుకు దృష్టిసారించిన ఆశలు పలించాయి. ఇటీవలే ఈ మాతా శిశు ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగి కొత్త సంవత్సరం నుంచే మహిళలకు ప్రసూతి సేవలతో పాటు చిన్నారులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
[caption id="attachment_5127" align="aligncenter" width="1200"]
జిల్లా ఆసుపత్రిలో ఇన్నాళ్లు సేవలందించిన ప్రసూతి, చిన్నారుల వైద్యలు మాతా శిశు ఆసుపత్రికి వెళ్లడంతో ఆసుపత్రి ఖాళీగా మారింది. దీంతో వాటి స్థానంలో ఐసీయూ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అనుకూలంగా మారింది. గత కొన్నేండ్ల నుంచి జిల్లా ఆసుపత్రిలో ఐసీయూ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నేతలు, ఆసుపత్రి వైద్యాధికారులు శ్రమిస్తున్నారు. గతంలోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్దం చేసి పంపించారు. ఇప్పటికైనా ఐసీయూను మంజూరు చేస్తే ఎన్నో ఎండ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రజల కలనెరవేరుతుంది.[/caption]