schedule Friday, September 04, 2026

ఉర్సుకు ముర్షద్‌ దర్గా ముస్తాబు

calendar_today July 25, 2026
person dharshininews
ఉర్సుకు ముర్షద్‌ దర్గా ముస్తాబు
ఉర్సుకు ముర్షద్‌ దర్గా ముస్తాబు - రేపటి నుంచి ఉర్సేషరీఫ్ ఉత్సవాలు - జయప్రదం చేయాలని ముతవల్లి విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ముర్షద్‌ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబయ్యింది. ఆదివారం నుంచి 80వ ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తుట్లు నిర్వహకులు ముతవల్లి అల్హజ్ సయ్యద్ అబ్దుల్‌ గనిపాష శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీం పాష సాహెబ్ ఖిబ్లా చిష్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 80వ ఉర్సే షరీఫ్‌తో పాటు హజ్రత్ సయ్యద్‌ అబ్దుల్ సలాం పాష సాహెబ్ చిష్తి ఖలందరి మిర్జాయి గారి 20 ఉర్సే షరీఫ్ ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. సోమవారం రాత్రి 7 గంటలకు గంధము వారి ఇంటి నుంచి బయల్దేరి 8గంటలకు దర్గా షరీఫ్‌కు చేరుకుని సందల్ మాలి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మంగళవారం దీపోత్సవం, రాత్రి 9-30గంటలకు ఖవ్వాలి, బుధవారం నమాజ్ బాద్ ఫజర్ తిలావత్ ఖురస్పాక్, ఉదయం 8గంటలకు ఫాతేహఖ్వాని, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. మరోవైపు ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని నెప్రాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ సర్వీసెస్ డైరెక్టర్ డా.మహమ్మద్ సోహెచ్‌ ఖాన్ హాజరువుతన్నారని తెలిపారు. కావున ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని ఉర్సుఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. https://www.dharshininews.com/43910/