schedule Friday, September 04, 2026

అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం..!

calendar_today July 25, 2026
person dharshininews
అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం..!
అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం..! - టాస్క్ ఫోర్స్‌ దాడుల్లో పట్టివేత - 5 ట్రాక్టర్లపై కేసులు నమోదు - వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ పరమేశ్వర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో అక్రమ ఇసుక రవాణాకు టాస్క్ ఫోర్స్, పోలీసులు కళ్లెం వేస్తున్నారు. శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి.. ట్రాక్టర్లను పోలీసులకు అప్పగించారు. పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం పాత తాండూరులోని కాగ్నానది నుంచి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ట్రాక్టర్లను అడ్డుకుని ఇసుక తరలింపునకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. అధికారులు స్కానింగ్‌ పత్రాలను నమోదు చేయకముందే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. చిన్న చిన్న లోపాలను చూపిస్తూ ఇసుక మాఫీయా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. https://www.dharshininews.com/43908/