మచ్చలేని ఎమ్మెల్యే మనోహరన్న..!
May 9, 2026
dharshininews
మచ్చలేని ఎమ్మెల్యే మనోహరన్న..!
- ఓర్వలేక నిరాధారాలతో కేసు
- బీఆర్ఎస్ పార్టీని నమ్మేది లేదు
- మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మచ్చలేని నాయకుడని, ఆయనపై ప్రజల్లో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేందుకే బీఆర్ఎస్ నేతలు నిరాధార కేసులు వేస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.
శనివారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అనుచరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజున మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు చేసిన రచ్చను అందరు గమనించే ఉంటారని గుర్తుచేశారు.
పోలీసులపై తోపులాటకు పాల్పడింది బీఆర్ఎస్ నేతలే అని అన్నారు. పైగా ఎమ్మెల్యేపై దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై కుట్ర పూరితంగా కేసు అయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు.
మచ్చ లేని నాయకుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బద్నాం చేసే రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
https://www.dharshininews.com/43256/