schedule Saturday, September 05, 2026

పక్కాగా జనగణన చేపట్టాలి

calendar_today May 5, 2026
person dharshininews
పక్కాగా జనగణన చేపట్టాలి
పక్కాగా జనగణన చేపట్టాలి - యాఫ్ ద్వారా తప్పుల్లేకుండా పూర్తి చేయాలి - జిల్లా అడిషనల్ సెన్సెస్‌ ఆఫీసర్ రవీందర్ రావు - తాండూరులో ముగిసిన శిక్షణ కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : జనాభా గణనను పక్కాగా చేపట్టాలని వికారాబాద్‌ జిల్లా అడిషనల్‌ సెన్సెస్ ఆఫీసర్ రవీందర్ రావు అన్నారు. తాండూరు మున్సిపాలిటీలో చేపట్టిన జనాభా గణన శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ సెన్సెస్ ఆఫీసర్‌ రవీందర్ రావు, జిల్లా టెక్నికల్ ఆఫీసర్ శ్రీ జంగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, మాస్టర్ ట్రెనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ సెన్సెస్ ఆఫీసర్ రవీందర్ రావు మాట్లాడుతూ జన గణనను పక్కాగా చేపట్టాలని అన్నారు. శిక్షణలో నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా ఈసారి జనాభా గణన డిజిటల్ పద్ధతిన చేయడం జరుగుతుందని, ఇచ్చినటువంటి యాప్ ద్వారా తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని అన్నారు. మ్యాపుల ద్వారా ఏరియాను ఏనుమారిటర్స్ గుర్తించి తమ కేటాయించిన ఏరియాలో పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో అభివృద్ధికి జనాభాగణన ఎంత ఉపయోగపడుతుందన్నారు. జన గణనలో తాండూరును జిల్లాలో ముందంజలో ఉండేలా చూడాలని కోరారు. అనంతరం శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు, సూపర్‌ వైజర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను అందజేశారు. https://www.dharshininews.com/43220/