schedule Saturday, September 05, 2026

అక్రమ రవాణాకు కళ్లెం..!

calendar_today May 5, 2026
person dharshininews
అక్రమ రవాణాకు కళ్లెం..!
అక్రమ రవాణాకు కళ్లెం..! - అంతారం వద్ద చెక్‌ పోస్టు ఏర్పాటు - బందోబస్తును పరిశీలించిన సీఐలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా తాండూరు సబ్‌ డివిజన్ పోలీసులు కళ్లెం వేస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా తాండూరు మండలం అంతారం గేటు వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ పోస్టు వద్ద బందోబస్తును మంగళవారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్‌లు పరిశీలించారు. చెక్ పోస్టు వద్ద సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమ రవాణా జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా బక్రీద్ సందర్భంగా ఆవులను తరలించకుండా వాహనాలను తనిఖీ చేయాలని అన్నారు. అక్రమాలను పాల్పడి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐలు తెలిపారు. మరోవైపు తాండూరు మండలం కొత్లాపూర్‌ వద్ద కూడా చెక్‌ పోస్టు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచడం జరిగిందని రూరల్ సీఐ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. https://www.dharshininews.com/43218/