schedule Sunday, September 06, 2026

భద్రేశ్వర జాతర కమిటి నియామకం

calendar_today March 14, 2026
person dharshininews
భద్రేశ్వర జాతర కమిటి నియామకం
భద్రేశ్వర జాతర కమిటి నియామకం - అధ్యక్షులుగా మేడి మహేష్‌ - మరో ఏడుగురికి స్థానం - దేవాదాయ శాఖ ఉత్తర్వుల జారీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ద భద్రేశ్వర దేవాలయ జాతర ఉత్సవ కమిటి నియామకం అయ్యింది. ఈ మేరకు దేవాదాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది నుంచి జాతర ఉత్సవాలు జరగడం ఆనవాయితి. జాతర ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని దేవదాయశాఖ కమిటిని ఏర్పాటు చేసింది. జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులుగా తాండూరుకు చెందిన మేడి మహేష్‌ను నియమించినట్లు తెలిసింది. ఆయనతో పాటు 2. గంగా శ్రావణ్ కుమార్, గాజుల విజయ్ కుమార్, లింగమంతుల శంకర్, శెట్టి చంద్రకాంత్, మద్రిక చంద్రకాంత్, కోర్వార్ అంజలి, అగ్గనూర్ సంకేత్‌లకు స్థానం కల్పించారు. గతంలో దేవాలయంకు సంబంధించి రెనవేషన్‌ కమిటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతర ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని జాతర కమిటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులుగా నియామకం అవుతున్న మేడి మహేష్ మాట్లాడుతూ జాతర ఉత్సవాలను బ్రహ్మండగా నిర్వహించేందుకు అందరి సహాకారంతో కృషి చేస్తానని అన్నారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. https://www.dharshininews.com/42519/