ప్రభుత్వ పథకాలకు పైసా ఇవ్వొద్దు..!
March 13, 2026
dharshininews
ప్రభుత్వ పథకాలకు పైసా ఇవ్వొద్దు..!
- డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకరండి
- తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ
- ముస్లిం సోదరులకు రంజాన్ కిట్ల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో తాండూరు పట్టణం, మండలంకు చెందిన 133 మందికి రూ. 1,33,15,428లు, యాలాల తహసీల్దార్ కార్యాలయంలో 61మందికి రూ. 61,07,076లు, బషీరాబాద్ మండలం రైతు వేదికలో 73మందికి రూ. 73,08,116ల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
మరోవైపు రంజాన్ పండగను పురస్కరించుకుని మైనార్టీ, ముస్లిం సోదరులకు ప్రభుత్వం మంజూరు చేసిన రంజాన్ కిట్లను కూడా అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాలు పేదింటి ఆడపిల్లలకు వరంలాంటిదని అన్నారు. అర్హులైన పేదల కోసం అమలు చేసే పథకాల కోసం పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరైనా డబ్బులు అడుగుతే స్వయంగా నాకు కాల్ చేయండని అన్నారు.
16న ఇఫ్తార్ విందు
రంజాన్ పండగ సందర్భంగా ఈ నెల 16 సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరు కావాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అందరిని ఆహ్వానించారు.
https://www.dharshininews.com/42498/