schedule Sunday, September 06, 2026

ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు..!

calendar_today March 9, 2026
person dharshininews
ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు..!
ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు..! - మున్సిపల్ ఎజెండా అంశాలపై బీఆర్ఎస్ అభ్యంతరం - రెండు అంశాలపై డీసెంట్ నోట్ అందజేత - బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజాధనం దుర్వినియోగం చేయరాదని బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం తెలిపిందని ఆ పార్టీ కౌన్సిలర్ ఈర్షాద్ తెలిపారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది. మొత్తం 11 అంశాలతో పాటు మరో రెండు టేబుల్ ఎజెండా అంశాలతో కౌన్సిల్ సమావేశం జరిగింది. మొత్తం అంశాలలో 6, 10వ అంశాలపై బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు ఆధ్వర్యంలో డీసెంట్‌ నోట్‌ అందించడం జరిగిందని ఈర్షాద్ తెలిపారు. ఎజెండాలోని 6వ అంశంలో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఇటాచీ జేసీబీకి యంత్రానికి సంబంధించిన విడి భాగాలను కొనుగోలు చేయడం గురించి, రిపేర్‌ గురించి రూ. 4లక్షల 86వేలను పెట్టడంపై అభ్యంతరం తెలిపినట్లు వివరించారు. ఈ రెండు అంశాలపై పార్టీ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు డీసెంట్‌ నోట్‌ అందించడం జరిగిందని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకు యత్నించడంతో అభ్యంతరం తెలపడం జరిగిందన్నారు. https://www.dharshininews.com/42358/