schedule Friday, September 04, 2026

తాండూరుకు వరల్డ్‌ కప్‌ మానీయా..!

calendar_today March 8, 2026
person dharshininews
తాండూరుకు వరల్డ్‌ కప్‌ మానీయా..!
తాండూరుకు వరల్డ్‌ కప్‌ మానీయా..! - ప్రత్యేక స్క్రీనింగ్‌ల ఏర్పాటు - గాంధీనగర్‌లో వీక్షించిన అభిమానులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభిమానులలో టీ20 వరల్డ్ కఫ్ మానియా కనిపించింది. ఆదివారం ఇండియా, న్యూజిలాండ్ మద్య టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్ కొనసాగింది. ఈ మ్యాచ్‌ను తాండూరు క్రీడాభిమానులు ఉత్సంహాగా తిలకించారు. తాండూరు పట్టణం గాంధీనగర్‌లో ప్రత్యేక స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ యువ నాయకులు బిడ్కర్ రఘు ఆధ్వర్యంలో స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. స్థానికులు, క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున తరలిచ్చారు. ఇండియా బ్యాటర్లు చెలరేగి ఆడడంతో కేరింతలతో ఉర్రూతలూరించారు. సిక్సులు, ఫోర్లు వస్తుంటే ఇండియాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ వరల్డ్‌ కప్ గెలుపుకు మద్దతు తెలిపారు. https://www.dharshininews.com/42330/