schedule Sunday, September 06, 2026

రోడ్లపై రద్దికి చైర్ పర్సన్‌ చెక్..!

calendar_today March 8, 2026
person dharshininews
రోడ్లపై రద్దికి చైర్ పర్సన్‌ చెక్..!
రోడ్లపై రద్దికి చైర్ పర్సన్‌ చెక్..! - వ్యాపారులకు నచ్చజెప్పిన నీరజా బాల్‌రెడ్డి - ఇబ్బందులు కలగకుండా విక్రయాలకు అనుమతి తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్లపై వ్యాపారాలతో ఏర్పడిన రద్దీ సమస్యకు తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి చెక్‌ పెట్టారు. తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కూరగాయల వ్యాపారులు రోడ్లపైకి వచ్చి విక్రయాలు చేపడుతున్నారు. ఇదే మార్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్ రాకపోకలకు, వాహాన దారుల రావాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి దృష్టికి వచ్చాయి. దీంతో ఆదివారం ఆమె మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి, అధికారులతో కలిసి పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ రోడ్లపై విక్రయాలు చేపడుతున్న వ్యాపారులతో మాట్లాడారు. రోడ్లపైకి వచ్చి పెట్టడం వల్ల అంబులెన్స్ కానీ, ద్విచక్ర వాహనదారుల గాని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరించారు. కావున రోడ్లపై వ్యాపారాలు చేపట్టరాదని సూచించారు. రోడ్డు పరిధి దాటి వ్యాపారాలు చేసుకునేందుకు అంగీకరించారు. ట్రాఫిక్ సమస్యను గుర్తించుకుని సహకరించాలని అన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట మేనేజర్ నరేందర్ రెడ్డి, జవాన్ రమేష్ సుభాష్ లు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/42307/