అడవిలో మహిళ వధ..!
January 24, 2026
dharshininews
అడవిలో మహిళ వధ..!
- గొంతు కోసి హత్యచేసిన దుండగులు
- పెద్దేముల్ మండలంలో వెలుగులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అడవి ప్రాంతంలో ఓ మహిళను గొంతు గోసి గుర్తుతెలియని వ్యక్తులు వధించారు. ఈ సంఘటన శనివారం పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది.
ప్రాథమిక సమాచారం మేరకు.. మండలంలోని రేగొండి సమీపంలోని అటవి ప్రాంతంలోని ముళ్ల పొదల్లో మహిళ మృతదేహాన్ని కొందరు గుర్తించారు. ఈ సంఘటన కలవరానికి గురిచేసింది. మృతురాలి వద్ద ఉన్న ఆధార్ కార్డు ద్వారా ఆమె ఆచూకీ తెలిసింది. యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన లొంక బందెమ్మగా గుర్తించారు. కూలీ పనులు చేసుకుంటూ జీవించేదని విచారణలో తెలిసింది. అయితే ఆమెను అటవి ప్రాంతంలోకి తీసుకవచ్చింది.. ఎవరు..? ఆమెను దారుణంగా హత్య చేసింది... ఎవరు అనేది మిస్టరీగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాం వద్ద టిఫిన్ బాక్సు, ఇతర వస్తువులను గుర్తించారు. పూర్తి దర్యాప్తు తరువాత హత్య మిస్టరీ వీడే అవకాశం ఉంది.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40694/