ఇడ్లీ కారంలో పురుగులు అవాస్తవం..!
January 22, 2026
dharshininews
ఇడ్లీ కారంలో పురుగులు అవాస్తవం..!
- హోటల్ నిర్వహణపై దుష్ప్రచారం
- నిర్వహకులపై కావాలనే వేధింపులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇడ్లీలో కారంలో పురుగులు వచ్చాయంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని హోటల్ నిర్వహకులు తెలిపారు.
తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి వద్ద ఉన్న హోటల్‌లో ఇడ్లీ కారంలో పురుగులు వచ్చాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై హోటల్ నిర్వహకులు మాట్లాడుతూ హోటల్‌లో ప్రజలకు స్వచ్చమైన భోజనాలను అందిస్తున్నామని తెలిపారు. కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నామని, ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదని గుర్తుచేశారు.
చిరు వ్యాపారులను కొందరు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కావాలనే కలుషిత ఆహారం అంటూ ప్రచారానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి అబద్దపు సంఘటనలు చిత్రీకరించి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. కలుషిత ఆహారం విక్రయిస్తున్నట్లు అనుమానిస్తే ఎలాంటి చర్యలకు అయినా సిద్దంగా ఉన్నామని తెలిపారు. తప్పుడు ప్రచారాలను చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40644/