schedule Friday, September 04, 2026

వామ్మో అర్ధరాత్రి దొంగలు...!

calendar_today January 2, 2026
person dharshininews
వామ్మో అర్ధరాత్రి దొంగలు...!
వామ్మో అర్ధరాత్రి దొంగలు...! - మొన్న బైకుల నుంచి పెట్రోల్ లూటీ - ఇప్పుడు ఏసీ మిషన్ సామాగ్రిల చోరీ - తాండూరులో వెలుగులోకి వస్తున్న ఘటనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్దరాత్రి సమయాల్లో ఇళ్ల వద్దకు వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం తాండూరు పట్టణం జానకీరాం నగర్(అయోధ్యనగర్‌)లో గుర్తుతెలియని ఇద్దరు ముఖాలకు మాస్కులు వేసుకుని ఇళ్ల వద్ద పార్కింగ్ చేసిన బైకుల నుంచి పెట్రోల్ లూటీ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. తాజాగా పట్టణంలోని ఓ ప్రాంతంలో ఓ యువకుడు ఓ భవనంలో ఏసీ మిషన్లకు సంబంధించిన కాపర్ వైర్లును దొంగతనం చేశాడు. ఈ దృశ్యాలు కూడా సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు బయటకు రావడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో దొంగతనాలపై పోలీసుల నిఘా కొరవడడంతో దొంగలు రెచ్చిపోతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు పట్టణంలో గస్తీ ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40334/