schedule Friday, September 04, 2026

సర్పంచ్ భర్తపై దాడి దుర్మార్గం..!

calendar_today December 20, 2025
person dharshininews
సర్పంచ్ భర్తపై దాడి దుర్మార్గం..!
సర్పంచ్ భర్తపై దాడి దుర్మార్గం..! - నిందితులను గుర్తించి శిక్షించాలి - తాండూరు డీఎస్పీకి వీరశైవ సమాజం ఫిర్యాదు తాండూరు దర్శిని ప్రతినిధి : కోట్ పల్లి సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అని తాండూరు వీరశైవ సమాజం సభ్యులు అన్నారు. శనివారం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. కోట్ పల్లి సర్పంచ్ భర్తపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. సంగయ్య స్వామి పై దాడికి పాల్పడడం వీరశైవుల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. సర్పంచ్ భర్తపై దాడి చేసిన దుండగులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, సర్పంచులు కరణ్ కోట్ రాజ్ కుమార్, చిట్టిగణాపూర్ పటేల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40110/