schedule Friday, September 04, 2026

ఇసుక రవాణాకు కళ్లెం..!

calendar_today December 16, 2025
person dharshininews
ఇసుక రవాణాకు కళ్లెం..!
ఇసుక రవాణాకు కళ్లెం..! - అనుమతి లేకుండా తరలిస్టున్న ట్రాక్టర్ సీజ్ - పట్టుకున్న తాండూరు పట్టణ పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అక్రమ ఇసుక రవాణాకు పట్టణ పోలీసులు కళ్లం వేసేందుకు చర్యలు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు పటిష్టి చర్యలు తీసుకున్నారు. మంగళవారం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పాత తాండూరు కాగ్నానది నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ఉదయం వేళ ఇసుక తరలింపుకు అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన ట్రాక్టర్ ను పట్టణంలోని ఆర్టీసీ డీపోకు తరలించారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40054/