schedule Friday, September 04, 2026

నేరాల నియంత్రణపై దృష్టిసారించాలి

calendar_today November 25, 2025
person dharshininews
నేరాల నియంత్రణపై దృష్టిసారించాలి
నేరాల నియంత్రణపై దృష్టిసారించాలి - పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి - తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య - పెద్దేముల్ పోలీస్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : నేరాల నియంత్రణకు దృష్టిసారించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సూచించారు. మంగళవారం పెద్దేముల్ పోలీస్టేషన్ ను డీఎస్పీ నర్సింగ్ యాదయ్య రూరల్ సీఐ ప్రవీణ్‌ కుమార్ రెడ్డి కలిసి సందర్శించారు. పెద్దేముల్ ఎస్ఐ శంకర్ డీఎస్పీ, సీఐలను స్వాగతించారు. ఈ సందర్బంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య స్టేషన్ లో పలు విభాగాలను పరిశీలించి.. రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరాలని అన్నారు. నేరాల నియంత్రణపై దృష్టిసారించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు మోసాలకు గురికాకుండా తగిన అవగాహన కల్పించేలా చూడాలన్నారు. దీంతో పాటు డయల్ 100 వినియోగంపై ప్రజలకు చైతన్యం కల్పించాలన్నారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసి ఓపెన్ డ్రింకింగ్ వంటి వాటిని నిర్మూలించాలని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39802/