schedule Friday, September 04, 2026

గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

calendar_today November 19, 2025
person dharshininews
గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం
గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం - పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం - ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మోత్కుపల్లికి చెందిన వినయ్ కుమార్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన హర్షవర్ధన్ 9వ తరగతి చదువుతున్నాడు. అయితే బుధవారం ఉదయం వినయ్, హర్షవర్ధన్ లు పాఠశాల నుంచి బయటకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వినయ్ కుమార్ ఏదైనా బస్సులో గ్రామానికి వచ్చారేమో అంటూ గ్రామంలో ఎదురుచూశాడు. బస్సులు అన్ని వెళ్లిపోయినా వినయ్ రాకపోవడంతో వెంటనే తాండూరులోని గురుకుల పాఠశాలకు వచ్చారు. ప్రిన్సిపల్, సిబ్బందిని అడడగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆవేధన వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు చూద్దాం అని దాటవేశారని అన్నారు. తమ పిల్లలను వెతికించి సురక్షితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39722/