schedule Sunday, September 06, 2026

పెద్దేముల్ పోలీస్టేషన్‌ వద్ద టెన్షన్‌..!

calendar_today November 17, 2025
person dharshininews
పెద్దేముల్ పోలీస్టేషన్‌ వద్ద టెన్షన్‌..!
పెద్దేముల్ పోలీస్టేషన్‌ వద్ద టెన్షన్‌..! - పోలీసుల దాడి బాధితుడి కుటుంభీకుల ఆందోళన - ఎస్ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ - తాండూరు రూరల్ సీఐ నగేష్‌కు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ పోలీస్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విచారణ కోసం పిలిచి పోలీసులు దాడికి పాల్పడ్డారని పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు ఫిరోజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ రెండు నెలల క్రితం అతను కౌలుకు తీసుకున్న పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఇదే కేసు విషయంపై ఎస్ఐ వేణు కుమార్ విచారణ నిమిత్తం గౌస్ అల్లుడు ఫిరోజ్ ను ఆదివారం పోలీస్టేషన్ కు పిలిపించారు. విచారణ పేరుతో ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని బాధితుడు ఫిరోజ్ ఆరోపించాడు. పోలీసుల దాడిలో గాయాలు కావడంతో సోమవారం ఉదయం ఫిరోజ్ ను కుటుంబీకులు తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో బాధిత వ్యక్తి కుటుంభీకులు పెద్దేముల్ పోలీస్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అప్పటికే అక్కడే ఉన్న రూరల్ సీఐ నగేష్, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, కరణ్‌ కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్‌లు పెద్దేముల్ పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. పోలిస్టేషన్‌ వద్దకు వచ్చిన బాధిత కుటుంభీకులతో మాట్లాడారు. ఫిరోజ్ పై దాడికి పాల్పడిన ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందుకు సీఐ నగేష్ మాట్లాడుతూ ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లపై విచారణ జరిపి శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. విచారణకు పిలిచి పోలీసులు దాడికి పాల్పడిన సంఘటన జిల్లా వ్యాప్తంగా వివాదాస్పందంగా మారింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39687/