schedule Saturday, July 04, 2026

దర్నా కేసులు వెనక్కీ...?

calendar_today November 7, 2025
person dharshininews
దర్నా కేసులు వెనక్కీ...?
దర్నా కేసులు వెనక్కీ...? - ఎత్తివేయాలని పోలీసుల నిర్ణయం..?  - ఎమ్మెల్యే చొరవతో వివాదంకు చెక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సేవ్ తాండూరు అని చేపట్టిన దర్నాలో నమోదు అయిన కేసుల విషయంలో పోలీసులు వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాల సమాచారం. నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చేవేళ్ల రోడ్డు ప్రమాద ఘటనతో తాండూరు డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద పౌరులు దర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దర్నాకు ఎలాంటి అనుమతులు లేవని తాండూరు పోలీసులు దర్నాలో పాల్గొన్న సుమారు 25 మందిపై కేసులు నమోదు చేశారు. kvcs ఈ కేసులు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు విమర్శలు వెలువెత్తించారు. దీంతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు చొరవ చూపారు. తాండూరు పౌరులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో పోలీసులు పౌరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు ఉన్న విధి విధానాలను అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. చివరకు తాండూరు సేవ్ అంటూ చేపట్టిన దర్నాలోని పౌరులకు కేసుల నుంచి ఊరట లభించనుంది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39472/