schedule Saturday, July 04, 2026

భారీ బంగారం చోరిలో.. సగం రికవరీ..!

calendar_today October 31, 2025
person dharshininews
భారీ బంగారం చోరిలో.. సగం రికవరీ..!
భారీ బంగారం చోరిలో.. సగం రికవరీ..! - కోర్టు ద్వారా బాధితుడికి అప్పగింత - మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనంలో పురోగతి - ఎప్పుడు.. ఎక్కడ జరిగిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : మూడేళ్ల క్రితం జరిగిన భారీ బంగారం చోరి కేసులో జిల్లా పోలీసులు పురోగతిని సాధించారు. అంతర్‌ రాష్ట్ర ముఠాకు చెందిన దొంగ నుంచి సుమారు సగం బంగారంను రికవరీ చేశారు. బాధితునికి కోర్టు ద్వారా రికవరీ చేసిన బంగారంను అప్పగించారు. మూడేళ్ల క్రితం జరిగిన చోరిలో పురోగతి సాధించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... తాండూరు మండలం మల్కాపూర్‌ గ్రామ సమీపంలోని ది ఇండియా సిమెంట్ కర్మాగారంలో ప్రోద్దుటూరుకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి పనిచేశారు. 2022 డిసెంబర్ నెలాఖరులో ఆయన ఇంట్లో దొంగలు దోపిడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న నగదుతో పాటు 65 తులాల బంగారంను ఎత్తుకుపోయారు. అప్పట్లో అడిషనల్ ఎస్పీ రషీద్ విచారణ చేపట్టారు. kvcs ఈ దొంగతనానికి పాల్పడింది అంతర్‌ రాష్ట్ర ముఠాగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ముఠాకు చెందిన ఓ దొంగ నుంచి 23 తులాల బంగారంను స్వాదీనం చేసుకున్నట్లు వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. కోర్టు ద్వారా నిందితుడికి రికవరీ చేసిన బంగారం 23 తులాలను తిరిగి అప్పగించడం జరిగిందని తెలిపారు. మిగతా ముఠా సభ్యులను గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే నిందితులును పట్టుకుని పూర్తి బంగారంను రికవరీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39314/