మందుబాబులకు షాక్...!
October 30, 2025
dharshininews
మందుబాబులకు షాక్...!
- 38 మందికి రూ. 66వేల జరిమాన
- జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చర్యలు
- వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ నగేష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి పట్టుబడిన మందుబాబులకు గట్టి షాక్ తగిలింది. తాండూరు సబ్ డివిజన్లోని వివిధ పోలీస్టేషన్లలో మందుబాబులపై నమోదైన కేసుల్లో వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ హర్ష చౌదరి నిందితులుకు జరిమాన విధించారు.
ఈ విషయాన్ని రూరల్ సీఐ నగేష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ డివిజన్ లోని కరణ్ కోట్ పోలీస్టేషన్లో 12, యాలాల పోలీస్టేషన్లో 15, పెద్దేముల్ పోలీస్టేషన్లో 6, బషీరాబాద్ పోలీస్టేషన్లో 5 చొప్పున మొత్తం 38 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు వారిని జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి ముందు హాజరు పరచగా 38 మంది ముందుబాబులకు రూ.66,500ల జరిమాన విధించడం జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ నగేష్ మాట్లాడుతూ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ల వారీగా కేసులు, జరిమానా వివరాలు
1. Karankote PS- 12 cases- fine amount 20,000/-
2. Yalal PS- 15 cases- fine amount 27,500/-
3. Peddemul PS - 6 cases- fine amount 11,000/-
4. Basheerabad ps- 5 cases- 8000/-
(Total 38 cases- fine amount. 66,500/-)
https://www.dharshininews.com/39316/
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39306/