మందులోడి మాస్టర్ మైండ్..!
October 30, 2025
dharshininews
మందులోడి మాస్టర్ మైండ్..!
- పరారికి ముందే ఐపీ ప్లాన్
- బాధితులకు అందిన నోటీసులు
- మరో వ్యాపారిపై జోరుగా పుకార్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చిట్టీల పేరుతో, వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకుని పరారైన మందుల వ్యాపారి భాగోతాలు బయటపడుతున్నాయి. డబ్బులు తీసుకుని పరారయ్యే ప్లాన్ ముందుగానే వేసుకున్నట్లు తెలుస్తోంది.
దివాలా తీసాననే సాకుతో ఐపీ పెట్టేందుకు ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు బలంగా బాధితులకు ఐపీ నోటీసులు అందినట్లు ప్రచారం సాగుతోంది. తాండూరు పట్టణానికి చెందిన మార్వాడి వ్యాపారి కుటుంబంతో సహా పరారైనట్లు తెలిసిందే. సుమారు రూ. 10 కోట్ల నుంచి 13 కోట్ల వరకు డబ్బులతో హుడాయించినట్లు పుకార్లు వచ్చాయి. ఓ వైపు మందుల ఏజేన్సి నిర్వహిస్తూ.. చిట్టీల వ్యాపారం నిర్వహించే వ్యాపారి వ్యాపారుల వద్ద, తమ వద్ద చిట్టీల పేరుతో ప్రజలు జమ చేసుకున్న డబ్బులతోనే పారిపోయినట్లు పలువురు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
అధికారికంగా కొన్ని చిట్టీలు, మరికొన్ని జీరో చిట్టీలతో డబ్బులు పోగేసుకుని.. పారిపోయినట్లు వాపోతున్నారు. అదేవిధంగా వ్యాపారి పారిపోయే ముందే ఐపీకి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. వ్యాపారి వద్ద చిట్టీలు కట్టిన పలువురుకి ఐపీ నోటీసులు అందినట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటి వరకు 10 మంది దాకా నోటీసులు అందాయని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా మందుల వ్యాపారి పరారైన సంఘటనతో పట్టణ వాసులు ఆందోళనకు గురువుతున్నారు. చిట్టీలు కట్టించుకున్న వ్యాపారులపై అనుమానాలను పెంచుకుంటున్నారు. దీనికితోడూ పట్టణానికి చెందిన ఓ చిట్టీ వ్యాపారి కూడా పరారయ్యేందుకు ప్లాన్ చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలతో చిట్టీలు వేసే వారు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/39299/