schedule Sunday, September 06, 2026

రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి

calendar_today October 8, 2025
person dharshininews
రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి
రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలి - పోలీసులకు ముస్లిం వెల్ఫేర్ ఫిర్యాదు - అసలేం జరిగిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్ గోశామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో సీఐ సంతోష్ కుమార్ కు ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోశామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రవక్త హజ్రత్ మహమ్మద్ పై ద్వేషపూరితంగా అనుచిత వాఖ్యలు చేశారని తెలిపారు. మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రవక్తపై అపహాస్య వాఖ్యలు చేసిన రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. kvcs ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ కమల్ అతహర్, ఉపాధ్యక్షులు మహమ్మద్ బాసిత్ అలీ, అబ్దుల్ సలీం, అబ్దుల్ ఖవి, అడ్వయిజరీ బోర్డు చైర్మన్ అబ్దుల్ అహాద్, ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీ కార్యదర్శి మహమ్మద్ యూనుస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖయ్యూమ్ అతహర్, కోశాధికారి ఫిరాజ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39038/