schedule Saturday, July 04, 2026

చికిత్స పొందుతూ సీసీఐ కాంట్రాక్టు కార్మికుడి మృతి

calendar_today October 6, 2025
person dharshininews
చికిత్స పొందుతూ సీసీఐ కాంట్రాక్టు కార్మికుడి మృతి
చికిత్స పొందుతూ సీసీఐ కాంట్రాక్టు కార్మికుడి మృతి - ఫ్యాక్టరీ వద్ద మృతదేహంతో కార్మికుల ఆందోళన - మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకులు - ఉద్యోగం, ప్రమాద చెల్లింపు హామితో దర్నా విరమణ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కరణ్ కోట్లోని సీసీఐ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కర్మాగారం ప్రతినిధుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని మృతదేహంతో ఫ్యాక్టరీ గేటు ముందు ఆందో ళనకు దిగారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. కుటుంభీకులు, కార్మికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీసీఐ ఫ్యాక్టరీలో కేపీ అండ్ సన్స్ కాంట్రాక్టర్ కింద ఖాజామీయా(45) వ్యక్తి కాంట్రాక్ట్ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఈనెల 3న రాత్రి విధులకు వెళ్లాడు. తనకు కేటాయించిన విభాగంలో బస్తాలు మోస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో కాంట్రాక్టర్ నుంచి నగదు చెల్లించకపోవడంతో ఖాజామియాను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఖాజామియా ఆదివారం రాత్రి మృతి చెందాడు. kvcs సోమవారం ఉదయం ఏఐటీయూసీ అధ్యక్షులు దస్తప్ప ఆధ్వర్యంలో కార్మికులు ఖాజామియా మృతదేహంతో ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఖాజామియాను తరలించే సమయంలో వసతులు అందుబాటులో ఉంచలేదని మండిపడ్డారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బైటాయించారు. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికులకు మద్దతు తెలిపారు. చివరకు కర్మాగారం ప్రతినిధులతో చర్చలు జరపగా మృతుని కుటుంబానికి రూ.7లక్షల 10వేల ప్రమాద బీమా చెల్లింపుతో పాటు మృతుని భార్యకు ఉద్యోగం అందిస్తామని హామి ఇవ్వడంతో కార్మికులు, నేతలు ఆందోళన విరమించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38994/