schedule Monday, September 07, 2026

సరైన వైద్యం అందక రెండు గేదెల మృతి

calendar_today October 6, 2025
person dharshininews
సరైన వైద్యం అందక రెండు గేదెల మృతి
సరైన వైద్యం అందక రెండు గేదెల మృతి - తాండూరు మండలం బెల్కటూర్ లో ఘటన - పాడి రైతుకు తీవ్ర నష్టం, ఆదుకోవాలని విజ్ఞప్తి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : సరైన వైద్యం అందక ఒకదాని వెనక మరొకటి.. ఒకే రోజు రెండు గేదెలు మృతి చెందాయి. ఈ సంఘటన తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాడి రైతు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అశోక్ కుమార్ పాడి రైతుగా ఉన్నాడు. ఈ యేడాది మార్చిలో సంగారెడ్డిలో రూ. 2లక్షల 30 వేలతో రెండు గేదెలను కొనుగోలు చేసుకుని తీసుకవచ్చాడు. గత ఆరు నెలల నుంచి ఈ రెండు గేదెలు పాలు ఇస్తున్నారు. గేదె పాలతో విక్రయాలు చేస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. అయితే రెండు, మూడు రోజుల క్రితం నుంచి ఈ రెండు గేదెలు అనార్యోగానికి గురయ్యాయి. మేత మేయకపోవడం, నీళ్లు తాగకపోవడంతో రైతు అశోక్ కుమార్ తాండూరు మండలం చెంగోల్ క్లస్టర్ కు చెందిన బాలకృష్ణ అనే పశువైద్యున్ని సంప్రదించారు. kvcs ఆయన గేదెలకు ఇంజక్షన్ ఇచ్చినట్లు రైతు అంజయ్య తెలిపారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఓ గేదె మృతి చెందింది. మరో గేదె మూత్రం ఎరుపురంగులో రావడంతో ఆందోళనకు గురై మళ్లీ పశువైద్యుడు బాలకృష్ణను సంప్రదించారు. ఆయన అందుబాటులో లేకపోయారు. చివరకు మధ్యాహ్నం 3 గంటలకు రెండో గేదే కూడా మృతి చెందింది. సరైన వైద్యం అందకపోవడంతో తమ గేదెలు మృత్యువాత పడ్డాయని ఆవేధన వ్యక్తం చేశారు. పాల విక్రయాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు రెండు గేదెలు మృతి చెందడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు పరిహారం అందించి.. ఆదుకునే విధంగా చూడాలని వేడుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38993/