schedule Monday, September 07, 2026

బీజేపీ నేతలపై అక్రమ కేసులు దుర్మార్గం

calendar_today October 5, 2025
person dharshininews
బీజేపీ నేతలపై అక్రమ కేసులు దుర్మార్గం
బీజేపీ నేతలపై అక్రమ కేసులు దుర్మార్గం - సంగెంకలాన్ ఘటనపై బీజేపీ నాయకుల అసంతృప్తి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని ఆ పార్టీ నేతలు అన్నారు. తాండూరు మండగం సంగెం కలాన్ గ్రామంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణ ఘటనపై ఆదివారం కరణ్ కోట్ పోలీస్టేషన్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి, పట్టణ అధ్యక్షులు సందర్శించారు. సీఐ నగేష్ తో మాట్లాడి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తాండూరు మండలంలో బీజేపీ బలమైన పార్టీగా మారుతుందని అన్నారు. ఈ క్రమంలో రాజకీయాల్లో భాగంగా పార్టీ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ఇతర పార్టీల నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలని, అక్రమంగా కేసులలో ఇరికించడం దుర్మార్గమన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో దుర్మార్గాలకు పాల్పడే పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38975/