schedule Saturday, September 05, 2026

టెంట్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం

calendar_today October 4, 2025
person dharshininews
టెంట్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం
టెంట్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం - మరో రెండు షాపులకు వ్యాపించిన మంటలు - మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది - తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని టెంట్ హౌస్‌లో అగ్రి ప్రమాదం జరిగింది. టెంట్‌ హౌస్‌ నుంచి చెలరేగిన మంటలు మరో రెండు షాపులకు వ్యాపించాయి. ఈ సంఘటన శనివారం పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే ట్రాక్ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎంఎస్ టెంట్‌ హౌస్‌ నిర్వహిస్తున్నారు. ఈ షాపు ముందుభాగంలో ఓ చిన్న షెడ్డు ఉంది. అందులో టెంట్ హౌస్‌కు సంబంధించిన సామాగ్రి ఉంచుతారు. అయితే శనివారం ఉదయం వేళ షెడ్డులో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. క్రమంగా ఈ మంటలు పక్కనే ఉన్న ఓ ఆటో మోబైల్‌ షాపు, వెల్డింగ్ షాపుకు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించారు. kvcs విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే టెంట్‌ హౌస్‌లో సామాగ్రి కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు నసీర్ అనే వ్యక్తి తెలిపారు. మిగతా ఆటో మోబైల్, వెల్డింగ్ షాపులో చిన్న, చిన్న వస్తువులు కాలిపోయాయి. అయితే అగ్ని ప్రమాదం జరిగిన టెంట్ హౌస్‌లో విద్యుత్ సరఫఱా లేదని, ఆటో మోబైల్ షాపులో కూడా కరెంట్ కనెక్షన్‌ లేదని నిర్వహకులు తెలిపారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు టెంట్‌ హౌస్‌లో అగ్గిపుల్ల వేసి మంటలు అంటించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదికూడా చదవండి..... https://www.dharshininews.com/38946/