వామ్మో.. పులి ఒచ్చిందీ..!?
September 16, 2025
dharshininews
వామ్మో.. పులి ఒచ్చిందీ..!?
- నాగులపల్లిలో అడవి జంతువు పాదముద్రలు
- భయాందోళనకు గురవుతున్న పరిసర ప్రాంతాల ప్రజలు
- జంతువు ఎటు వెళ్లిందో గుర్తించిన అటవీశాఖ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వామ్మో.. పులి ఒచ్చినట్లే ఉంది.. అని తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం నాగులపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం గ్రామ పరిసర ప్రాంతాల్లో అడవి జంతువు సంచరించినట్లు పాద ముద్రలను గుర్తించారు.
ఈ సంఘటనతో గ్రామస్తులు భయాంతోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు విషయాన్ని తాండూరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌ఓ శ్రీదేవి సరస్వతి, ఎఫ్‌ఎస్‌ఓ స్వప్న, ఎఫ్‌వీఓ నాగసాయి నాగులపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు తెలిపిన ప్రదేశంలో అడవి జంతువు పాదముద్రలను గుర్తించారు. చివరకు చిరుతపులి పాదాలు అని నిర్దారణకు వచ్చారు.
నాగుపల్లి అటవి ప్రాంతం నుంచి పులి తాండూరు మండలం జినుగుర్తి అడవి మార్గంలోకి వెళ్లి ఉండవచ్చని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. మరోవైపు అటవి జంతువు సంచరిస్తున్న వార్తతో నాగుపల్లితో పాటు ఎర్రగడ్డ తాండా, సిద్దన్నమడుగు తాండా, రుద్రారం, తట్టెపల్లి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/38618/