schedule Saturday, July 04, 2026

మంచోళ్లకు.. ఇంతటి సావా..!

calendar_today September 7, 2025
person dharshininews
మంచోళ్లకు.. ఇంతటి సావా..!
మంచోళ్లకు.. ఇంతటి సావా..! - కుటుంబ కలహాలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య - యాలాల మండలం రాస్నంలో కలకలం - దంపతుల కథ గుర్తుచేసుకుని కన్నీళ్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : భూమి మీద మంచోళ్లకే చెడ్డ సావొస్తుందా.. వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని రాస్నంలోని ప్రజలు చర్చించుకున్నారు. ఆ గ్రామంలో ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడడమే ఈ చర్చకు కారణం. kvcs ఆ ఊళ్లో మంచి పేరు, ప్రతిష్టలు కలిగిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు. గ్రామానికి చెందిన మంచన్ పల్లి శ్రీనివాస్ రెడ్డి(60), భాగ్యమ్మ(55) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు కరణాకర్‌ రెడ్డి, దయాకర్‌ రెడ్డిలు ఉన్నారు. కుమారులకు ఇద్దరికి పెళ్లిల్లు కాలేదు. వీరికి 5ఎకరాల అసైన్డ్ భూమి, 2 ఎకరాల పట్టా భూమి ఉండేది. కొన్ని నెలల క్రితం 2 ఎకరాల భూమిని అమ్మేశారు. ఇందులో కొంత డబ్బునుంచి పెద్ద కుమారుడు వేరే ఊళ్లో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. కుటుంబంలో గొడవలు జరుగుతుండేవని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గొడవల వల్ల మనస్థాపం చెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా శనివారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగినట్లు సమాచారం. ఆదివారం శ్రీనివాస్ రెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. అతని భార్య సమీపంలోని కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉన్నంతలో శ్రీనివాస్ రెడ్డి, భాగ్యమ్మలు మంచిగానే బతికారు. శ్రీనివాస్ రెడ్డి తండ్రి భీంరెడ్డి పూర్వంలో ఉమ్మడి రాస్నం గ్రామానికి సర్పంచుగా పనిచేసినట్లు, శ్రీనివాస్ రెడ్డి కూడా అదే ఉమ్మడి రాస్నం గ్రామానికి ఉపసర్పంచుగా పనిచేశారని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. ఇంత మంచిగా బతికిన దంపతులు ఆత్మహత్యకు పాలపడడం కలకలం రేపింది. ఈసంఘటన గ్రామంలో తీవ్ర విషాధం నింపింది. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/38445/