schedule Monday, September 07, 2026

మత్తు.. జీవీతాలకు చేటు..!

calendar_today September 2, 2025
person dharshininews
మత్తు.. జీవీతాలకు చేటు..!
మత్తు.. జీవీతాలకు చేటు..! - మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి - ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : మత్తు.. జీవితాలకు చేటు చేసే వ్యసనం అని, దానికి దూరంగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ నేరాల తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. kvcs ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు మానసినక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు అని అన్నారు. ఇవి యువతను చెడుమార్గంలో నడిపిస్తాయన్నారు. చదువులో వెనుకబాటుకు గురి.. భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు. వీటికి దూరంగా ఉండి.. ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. అదేవిధంగా మానవ అక్రమ రవాణా, బాల్య వివాహలు చట్టవిరుద్ధ కార్యక్రమాలు అని అన్నారు. వీటిలో ఇరుక్కుంటే శిక్ష తప్పదని అన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ మల్లినాథప్ప, అద్యాపకులు, సిబ్బంది. విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/38371/